Monkey Throws Baby: బిల్డింగ్‌పై నుంచి కోతి పడేయడంతో 4నెలల శిశువు మృతి

మూడంతస్థుల బిల్డింగ్ రూఫ్ మీద నుంచి నాలుగు నెలల పసికందును తోసేసింది కోతి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఆదివారం జరిగిన ఈ ఘటన కారణంగా మృతి చెందాడు. బరేలీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ లలిత్ వర్మ.. విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి తెలిపామని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు.

Monkey

 

 

Monkey Throws Baby: మూడంతస్థుల బిల్డింగ్ రూఫ్ మీద నుంచి నాలుగు నెలల పసికందును తోసేసింది కోతి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఆదివారం జరిగిన ఈ ఘటన కారణంగా మృతి చెందాడు. బరేలీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ లలిత్ వర్మ.. విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి తెలిపామని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు.

బరేలీలోని డుంకా గ్రామంలో నిర్దేశ్ ఉపాధ్యాయ్ (25) అతని భార్య ఉంటున్నారు. వారిద్దరూ మూడంతస్థుల బిల్డింగ్ పై నాలుగు నెలల పసికందుతో కలిసి శుక్రవారం సాయంత్రం నడుస్తున్నారు. అదే సమయంలో కోతుల గుంపు రూఫ్ మీదకు వచ్చింది. ఆ దంపతులు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే కోతులు వారిని చుట్టుముట్టేశాయి. మెట్లవైపు పరిగెత్తే ప్రయత్నంలో చేతుల్లోని పసిబిడ్డ జారిపోయింది.

పడిపోయిన బిడ్డను తీసుకునేందుకు నిర్దేశ్ వెళ్లేసరికి కోతి తీసుకుని బిడ్డను రూఫ్ మీద నుంచి కిందకు విసిరేసింది. ఈ ఘటనలో విషాదకరంగా బిడ్డ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను ప‌ట్టుకున్న పులి