Madhya Pradesh: ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను ప‌ట్టుకున్న పులి.. వీడియో

ఇందుకు సంబంధించిన వీడియోను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వు శాఖ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కోతిని ప‌ట్టుకోవ‌డానికి చెట్ల‌పైకి ఎక్కి ఓ చెట్టు కొమ్మ నుంచి మ‌రో చెట్టు కొమ్మ‌పైకి దూకుతూ పులి చేసిన సాహ‌నాన్ని కొంద‌రు మెచ్చుకుంటుంటే , మరికొంద‌రు నెటిజ‌న్లు ఆ పులిని తిట్టిపోస్తున్నారు.

Madhya Pradesh: ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను ప‌ట్టుకున్న పులి.. వీడియో

Viral Video

Madhya Pradesh: న‌క్కి న‌క్కి దాక్కుంటూ, అదునుకోసం ఓపిక‌గా వేచి చూసి జంతువుల‌ను వేటాడి తింటుంది చిరుత‌ పులి. కోతులేమో చెట్ల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు దూకుతూ ఒక చోటి నుంచి మ‌రో చోటుకి వెళ్తుంటాయి. అటువంటి ఓ కోతి పిల్ల‌ను వేటాడాల‌నుకుంది పులి. కోతిని ప‌ట్టుకోవ‌డం అంత సులువైన విష‌యం కాదు. అందుకోసం చెట్లు ఎక్కాలి. ఆ ప‌ని కూడా చేసింది పులి. చివ‌ర‌కు ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను నోటితో గ‌ట్టిగా ప‌ట్టుకుని జ‌ర్రున జారుతూ చెట్టు పై నుంచి కింద ప‌డిపోయింది.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

ఇందుకు సంబంధించిన వీడియోను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వు శాఖ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కోతిని ప‌ట్టుకోవ‌డానికి చెట్ల‌పైకి ఎక్కి ఓ చెట్టు కొమ్మ నుంచి మ‌రో చెట్టు కొమ్మ‌పైకి దూకుతూ పులి చేసిన సాహ‌నాన్ని కొంద‌రు మెచ్చుకుంటుంటే , మరికొంద‌రు నెటిజ‌న్లు ఆ పులిని తిట్టిపోస్తున్నారు. చిటారు కొమ్మ‌కు చేరుకునే కోతిని ప‌ట్టుకోగ‌ల‌న‌ని ఆ పులి ఎలా అనుకుంద‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఎవ‌రితో అయినా పెట్టుకోవ‌చ్చు కానీ, పులితో పెట్టుకోవ‌ద్ద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.