Crane collapses Video: ఆలయ ఉత్సవంలో క్రేన్ కూలి నలుగురి మృతి.. తొమ్మిది మందికి గాయాలు

తమిళనాడు అరక్కోణంలో ఆలయ ఉత్సవంతో ఘోర ప్రమాదం జరిగింది. కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవం జరుగుతున్న సమయంలో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని సహాయక బృందాలు, పోలీసులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Crane collapses Video: తమిళనాడు అరక్కోణంలో ఆలయ ఉత్సవంతో ఘోర ప్రమాదం జరిగింది. కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవం జరుగుతున్న సమయంలో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని సహాయక బృందాలు, పోలీసులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్సవంలో క్రేన్ వినియోగించేందుకు కనీసం అనుమతి కూడా తీసుకోకుండా దాన్ని నిర్వాహకులు వాడినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఉత్సవంలో క్రేన్ వినియోగించేందుకు అనుమతి లేదని పోలీసులు గుర్తించారు.

భక్తులంతా ఆలయ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తుల రోధనలతో ఆలయ పరిసర ప్రాంతం అంతా నిండిపోయింది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తమవారికి ఏమైందో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఆలయ పరిసర ప్రాంతానికి తరలివచ్చారు.

తమిళనాడులో పొంగల్ అనంతరం ప్రతి ఏడాది ఆలయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయ ఉత్సవంలో భాగంగా భక్తులు క్రేనుకు వేలాడడం, దేవుడి ప్రతిమకు దండలు వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే క్రేన్ ఒక్కసారిగా కూలి భక్తులపై పడింది.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

ట్రెండింగ్ వార్తలు