భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెకు చాలారోజుల నుంచి హైపర్ టెన్షన్ ఉందని డాక్టర్లు తెలిపారు.
గడిచిన 3-4రోజుల నుంచి ఆమె శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని,ఛాతీ నొప్పితో బాధపడిందని డాక్టర్లు తెలిపారు. ఇవాళ ఆమె మరణంతో…మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 7కి చేరుకుంది. అంతేకాకుండా ముంబైలో నమోదైన 5వ కరోనా మరణం ఇది. భారత్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైంది మహారాష్ట్రలోనే.
మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 193కి చేరుకుంది. ముఖ్యంగా ముంబైలోనే 77కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేరళలో ఎక్కువగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 949కి చేరుకోగా,25 మరణాలు సంభవించాయి.