ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యం : ఆపరేషన్ చేసిన మహిళల్ని కటిక నేలపైనే పడుకోబెట్టారు

  • Publish Date - November 27, 2019 / 09:00 AM IST

ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని గైరాస్ పూర్ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ చేయించుకున్న  మహిళల్ని నేలమీదనే పడుకోబెట్టిన వైనం బైటపడింది. నవంబర్ 25న స్టెరిలైజేషన్ సర్జరీ (పిల్లలు పుట్టకుండా చేయంచుకునే ఆపరేషన్) చేసిన 41మంది మహిళల్ని హాస్పిటల్ కారిడార్ లో ఓ దుప్పటి పరిచి నేలపై పడుకోబెట్టారు. 

ఈ విషయం బైటపడటంతో స్థానికంగా కలకలం రేపింది. హాస్పిటల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పేదలంటే డాక్టర్లకు అంత నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్నారు. ఇది వెలుగులోకి రావటంతో జిలల్ా సీఎంఓ ఏకే లహిర్ పర్ విచారాణకు ఆదేశించారు.  దీనికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని..గైరాస్ పూర్ ఆరోగ్య కేంద్రానికి నోటీసులు జారీ చేశామని..డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని…మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.  

కాగా ఆపరేషన్ జరిగిన మహిళలు నేలమీద నుంచి లేవాలంటే ఎంతటి బాధ..ఇబ్బంది పడాల్సి వస్తుందో డాక్టర్లకు తెలుసు. నేలమీద నుంచి పైకి లేవాల్సిన సమయంలో కుట్లు తెగిపోయే ప్రమాదం కూడా జరగవచ్చు. ఈ విషయం తెలిసి కూడా డాక్టర్లు ఇలా చేశారు అంటే అది వారి నిర్లక్ష్యమని తెలుస్తోంది. 

గతంతో కూడా విదీశఆలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవటానికి వచ్చి మహిళలను రాత్రి వరకూ వెయిట్ చేసిన ఘటన జరిగింది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవటానికి 29 మంది మహిళలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆపరేషన్ కోసం ఉదయమే మహిళలు వచ్చినా ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ మాత్రం రాలేదు. తాపీగా సాయంత్రం 5 గంటలకు వచ్చిన సదరు డాక్టర్ అప్పుడు ఆపరేషన్లు చేయటం ప్రారంభించగా..అది రాత్రి వరకూ కొనసాగింది. దీంతో ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్న మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. డాక్టర్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తు..వారితో పాటు వచ్చిన బంధువులు..చిన్నపిల్లలు కూడా ఆకలితో అలమటిస్తూ..ఇబ్బందులు పడాల్సి వచ్చింది.