×
Ad

Naxals Surrender : 44మంది మావోయిస్టులు లొంగుబాటు.. పోలీసుల తొలి విజయం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

  • Published On : January 1, 2022 / 06:45 PM IST

Naxals Surrender

Naxals Surrender : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 9మంది మహిళలు కూడా ఉన్నారు. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట నక్సలైట్లు లొంగిపోయారు.

Whatsapp Payment: వాట్సాప్ ద్వారా మీ బ్యాంకు బ్యాలన్స్ ఇలా తెలుసుకోండి

మావోయిస్టులను చింతలనార్ పీఎస్ పరిధిలోని కరిగుండం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్లాటూన్ దళంపై రూ.2లక్షల రివార్డు ఉంది. కరిగుండం క్యాంపు తర్వాత పోలీసులు తొలి విజయం సాధించారు. లొంగిపోయిన మావోయిస్టులు, గ్రామస్తులతో కలిసి పోలీసులు భోజనాలు చేశారు.