తమిళనాడులో ఒక్క రోజులోనే 477 కరోనా కేసులు

  • Publish Date - May 16, 2020 / 04:47 PM IST

తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం (మే 16, 2020) కొత్తగా 477 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,585కు చేరింది. 

రాష్ట్రంలో మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. శనివారం మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 74కు చేరింది. మొత్తం కేసులలో 6,970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,538 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.