గ్రూప్-C ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 5శాతం రిజర్వేషన్లు

5% quota for ex-servicemen in group c jobs గ్రూప్-సీ పోస్టుల్లో మాజీ సర్వీస్ సిబ్బందికి ఐదు శాతం రిజర్వేషన్‌ను ప్రకటించింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, వైమానిక దళాల నుంచి రిటైర్డ్, మాజీ సర్వీస్ సిబ్బంది ఐదు శాతం రిజర్వేషన్‌కు అర్హులని సీఎం మోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ నివాసి మాత్రమే దీనికి అర్హులని తెలిపారు.



రక్షణ రంగంలో యూపీ నుంచి ఎక్కువ ఉంటున్నారని, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో మాజీ సేవా సిబ్బంది రాష్ట్రంలో నివసిస్తున్నారన్నారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. యోగి సర్కార్ తాజా నిర్ణయంతో మాజీ అధికారులు, కార్మికులను ప్రోత్సహిస్తుందని, కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తుందని తెలిపారు.



మరోవైపు, అమరులైన వారి కుటుంబానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ప్రభుత్వం అమరవీరుడి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తోంది. 2017 ఏప్రిల్ ఒకటి తర్వాత అమరవీరుడైన ఏదైనా రక్షణ సేవలు, పారా మిలటరీ దళాల కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు