ఇటీవల విపరీతంగా వైరల్ అయిన 5 ఫొటోలు ఇవే.. నవ్వు ఆపుకోలేరు..

ఓ కస్టమర్ స్విగ్గీలో లైమ్ సోడాను ఆర్డర్ ఇస్తే, అతడికి ఖాళీ సీల్డ్ బాటిల్‌ వచ్చింది. మరో వ్యక్తి..

సామాజిక మాధ్యమాల్లో ఇటీవల 5 పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. చాలా ఫన్నీగా ఉన్న ఈ పోస్టులు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఆ 5 పోస్టులు ఏవో చూద్దాం.

బేసన్ లడ్డూ కాస్త బేసన్ హల్వాగా

ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బేసన్ లడ్డూ కాస్త బేసన్ హల్వాగా మారింది. దీన్ని బేసన్ కేక్ అని కూడా కొందరు పిలిచారు. అధిక వేడి కారణంగా తన బేసన్ లడ్డూ కరిగి పోయి హల్వాగా మారిందని ఓ నెటిజన్ ఆన్‌లైన్‌లో దీన్ని పోస్ట్ చేశాడు.

స్పైడర్ మ్యాన్ రూఫ్‌టాప్‌పై..

స్పైడర్ మ్యాన్ రూఫ్‌టాప్‌పై కూర్చుని చపాతీ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో కూడా తెగ వైరల్ అవుతోంది. స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ఓ యువకుడు పోస్ట్ చేసిన ఈ ఫొటోరి ఇన్‌స్టాగ్రామ్‌లో 17 లక్షల మంది చూశారు.

ఆసుపత్రిలా కాకుండా రిసార్ట్‌లో..


ఓ నెటిజన్ ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. అది ఆసుపత్రిలా కాకుండా అతడు రిసార్ట్‌లో బస చేసినట్లుగా అందులో గడిపాడు. తాను ఇష్టపడే ఆహారాలను వివరించి చెప్పాడు.

నోటిఫికేషన్‌లతో విసిగిపోయి


ఆన్‌లైన్ డెలివరీ యాప్ జెప్టో ఇస్తున్న నోటిఫికేషన్‌లతో విసిగిపోయిన వీర్ దాస్ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పారు. ఈ నోటిఫికేషన్ ను తనకు పంపొద్దని జెప్టోని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరారు. నోటిఫికేషన్లకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశాడు. ఇది తెగవైరల్ అయింది.

సోడాను ఆర్డర్ ఇస్తే..


ఓ కస్టమర్ స్విగ్గీలో లైమ్ సోడాను ఆర్డర్ ఇస్తే, అతడికి ఖాళీ సీల్డ్ బాటిల్‌ వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ చేశాడు. సోడా కాస్త వేడి కారణంగా ఆవిరైపోయిందని, బాటిల్ మాత్రమే మిగిలిందని కొందరు సెటైర్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు