Shoping Mall
Lulu Mall: షాపింగ్ మాల్స్ లో వస్తువులకు కొద్దిపాటి డిస్కౌంట్ ప్రకటిస్తే చాలు.. వందలాది మంది షాపింగ్ మాల్ వద్దకు పరుగులు పెడుతుంటారు.. ప్రతీ వస్తువుపై 50శాతం డిస్కౌంట్ అంటే.. ఊరుకుంటారా.. అర్థరాత్రి సమయంలో షాపింగ్ మాల్ వద్దకు ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో అక్కడికి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. షాపింగ్ మాల్ లో ఇసుకేస్తే రాలనంత మంది ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను 50శాతం డిస్కౌంట్ కు దక్కించుకొనేందుకు ఒకరినొకరు తోసుకుంటూ పోటీపడ్డారు. ఈ ఘటన కేరళలలోని తిరువనంతపురం లులు మాల్ లో చోటు చేసుకుంది. లులు షాపింగ్ మాల్ యాజమాన్యం తమ కస్టమర్లను పెంచుకునేందుకు వినూత్న రీతిలో ఆలోచించింది.
Thread on some videos from #Lulumall, cochin !!
Looked like the entire Kochi was in the mall. Reminded me of Saravana stores, chennaipic.twitter.com/AscmYHFljM
— Vineeth K (@DealsDhamaka) July 8, 2022
ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మిడ్ నైట్ సేల్ పేరుతో.. కొన్ని వస్తువులకు 50శాతం తగ్గింపు ఇస్తామని ప్రచారం చేసింది. ఈ అవకాశాన్నిజూలై 6 రాత్రి 11:59 నుండి జూలై 7 తెల్లవారుజాము వరకు ప్రకటించింది. ఈ విషయం విస్తృత ప్రచారం కావడంతో.. తిరువనంతపురం ప్రాంతంలోని షాపింగ్ మాల్స్ కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒక్కసారిగా తరలిరావడంతో గురువారం అర్థరాత్రి సమయంలో ఆ షాపింగ్ మాల్ జనంతో రద్దీగా కనిపించింది. ఎంతగా అంటే ఇసుకేస్తే రాలనంత.
Remember iPhone launch queues ?
Here is our Kerala’s Lulu Mall sale queue at midnight:— Vijay Shekhar Sharma (@vijayshekhar) July 9, 2022
భారీగా ప్రజలు తరలిరావడంతో షాపింగ్ మాల్ లోని ఎస్క్లేటర్లు సైతం అడుగు పెట్టే వీలులేకుండా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నెటిజన్లు కొందరు ప్రజల అత్యుత్సాహాన్ని విమర్శిస్తుండగా, మరికొందరు షాపింగ్ మాల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెస్సేజ్ లు చేశారు. ఈ శుక్రవారం బ్లాక్ డే అంటే కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయంటూ గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.