Covid Positive: ఒకే స్కూళ్లో 52మందికి కొవిడ్ పాజిటివ్

మహారాష్ట్రలోని జవహర్ నవోదయ స్కూల్ లోని 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో షాక్ అయింది మేనేజ్మెంట్. దాంతో పాటుగా మరో 450మంది విద్యార్థులకు పరీక్షలు జరపగా ఇంకో 33మందికి..

19 School Students Covid Positive In Maharashtra

Covid Positive: మహారాష్ట్రలోని జవహర్ నవోదయ స్కూల్ లోని 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో షాక్ అయింది మేనేజ్మెంట్. దాంతో పాటుగా మరో 450మంది విద్యార్థులకు పరీక్షలు జరపగా ఇంకో 33మందికి పాజిటివ్ అని తేలింది. అలా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 52కు చేరింది. ప్రస్తుత స్కూల్ ను సీల్ చేస్తూ.. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

అహ్మదాబాద్ జిల్లాలోని టక్లీ ఢోకేశ్వర్ ప్రాంతంలో స్కూల్ ఉంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు వేగవంతంగా పెరుగుతూ 422కు చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. దాదాపు కొత్త వేరియంట్ కారణంగా 108కి చేరుకుంది కేసుల సంఖ్య. వారిలో ఇప్పటివరకూ 42మంది రికవరీ అయినట్లు హెల్త్ మినిష్ట్రీ చెబుతుంది. డిసెంబర్ నెలలో ముంబైలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ముఖ్యంగా జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూళ్లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

rAED aLSO: ఒమిక్రాన్ టెన్షన్..ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ