‘56inch Modi Ji’ Thali : ప్రధాని మోడీ పుట్టినరోజు .. ఢిల్లీ రెస్టారెంట్ రూ.8.5 లక్షలు గెలుచుకునే బంపర్ ఆఫర్ .. ఇక మీదే ఆలస్యం
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రూ.8.5 లక్షలు గెలుచుకునే బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాలీ తినండీ రూ.8.5 లక్షలు గెలుచుకోండి అంటూ ప్రకటించింది.
- nagamani
- Published on- September 16, 2022 / 03:08 PM IST
‘56inch Modi Ji’ Thali :
‘56inch Modi Ji’ Thali : ‘తాలీ తినండి..రూ.8.5 లక్షల నగదు గెలుచుకోండి’ అంటూ ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబరు 17 మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ‘ఆర్డర్ 2.0’ రెస్టారెంట్ ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో తినేసినవారికి రూ.8.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇక మీదే ఆలస్యం..రండి తినండీ నగదు గెలుచుకోండి అంటూ ప్రకటించింది. వెల్లడించింది.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ‘ఆర్డోర్ 2.0’ రెస్టారెంట్ యజమాని సుమిత్రా కల్రా ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ..మోడీ అంటే తనకు ఎంతో గౌవరం అని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నామని.. అందుకే తాలీ పోటీ పెట్టామని తెలిపారు. ప్రత్యేకమైన తాలీకి ’56 అంగుళాల మోడీజీ’ అని పేరు పెట్టినట్టామని వివరించారు.
ఈ పోటీలో దంపతులు పాల్గొనవచ్చని..వారిలో ఏ ఒక్కరైనా 40 నిమిషాల్లోపు తాలీ మొత్తం తింటే వారికి రూ.8.5 లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు, సెప్టెంబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య తమ రెస్టారెంట్ లో తాలీ భుజించిన వారిలో లక్కీ విన్నర్ కు కేదార్ నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామని సుమిత్ర కల్రా చెప్పారు. ఈ తాలీ 56 ఆహార పదార్ధాలతో పెద్ద-పరిమాణంలో ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ ఐటెమ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.
