Gas Cylinder Exploded: పెళ్లి వేడుకలో పేలిన సిలిండర్లు.. ఐదుగురు మృతి.. 60మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. భుంగ్రా గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా పక్కనే  స్వీట్ షాపు వద్ద గ్యా స్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 60 మందికి గాయాలయ్యాయి.

Gas Cylinder Exploded: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌ జిల్లా షేర్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. భుంగ్రా గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా పక్కనే  స్వీట్ షాపు వద్ద గ్యా స్ సిలిండర్ పేలడంతో  60 మందికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడుతో పెళ్లి వేడుకలో గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు దాటికి మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా మంటల్లో చిక్కుకున్నవారి కేకలతో విషాదం వాతావరణం నెలకొంది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

Gas cylinder: ఎన్టీఆర్ జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హిమన్షు గుప్తా, రూరల్ ఎస్పీ అనిల్ కయల్ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను బోధ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంబులెన్సులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు. మరోవైపు షేర్‌గఢ్ తహసీల్ ఆసుపత్రిలో 18 మందికి ప్రథమ చికిత్స అందించారు.

బోధ్‌పూర్ జిల్లా కలెక్టర్ హిమన్షు గుప్తా మాట్లాడుతూ.. ఐదు సిలిండర్లు పేలినట్లు తెలిపారు. భుంగ్రా గ్రామంలో తగత్ సింగ్ కుమారుడి వివాహ ఊరేగింపుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో స్వీట్ షాపు సమీపంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిందని తెలిపారు. ఈ పేలుడు దాటికి వివాహానికి హాజరైన 60 మందికి గాయాలయ్యాయి. వీరిలో 42 మంది మహిళలు ఉన్నారు. 10 మందికి 90శాతం గాయాలయ్యాయని, 30 మంది 50శాతం గాయపడినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడాడు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ను గెహ్లాట్ ఆదేశించారు. ఇదిలాఉంటే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు