TV పెట్టండి అన్నందుకు చిన్నారిని చంపేశాడు

  • Publish Date - July 18, 2020 / 08:10 AM IST

క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుతున్నాయి.

తాజాగా..

TV పెట్టండి అన్నందుకు చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి జిల్లాలో ఏడేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి నివాసం ఉండేది. మూడో తరగతి చదువుతోంది. తల్లి రోజు వారి కూలి పని చేసుకుంటూ పొట్ట పొసుకొంటోంది.

ఈ క్రమంలో..2020, 15వ తేదీ బుధవారం వీరింట్లో కరెంటు లేదు. దీంతో TV చూడడం కోసం పొరుగింటికి వెళ్లింది. ఆ సమయంలో ఆ ఇంట్లో టీవీ ఆఫ్ చేసి ఉంది. Anucle Tv On చేయండి..అంటూ ఆ చిన్నారి అడిగింది. ఆ సమయంలో అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరితోనే గొడవపడుతున్నాడు. అప్పుడే ఆ చిన్నారి అడగడంతో..తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

వెంటనే చిన్నారి గొంతును నులిమేశాడు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. అనంతరం ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పాడు. అతడి సహాయంతో డెడ్ బాడిని ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి స్థానికంగా ఉన్న నాలాలో విసిరేశాడు. డ్రమ్ము నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, సహకరించిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని తల్లి ఆరోపించింది. దీంతో పోస్టుమార్టం కోసం తిరునివేలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు పంపారు. హత్య పోక్సో చట్టం కింద నిందితులుపై కేసు నమోదు చేశారు. కూతురు ఇక లేదని తెలుసుకున్న ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.