7 Years Of NDA : మోడీ పాలనకు ఏడేళ్లు..సేవ కార్యక్రమాలు చేస్తున్న నేతలు

మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని...దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

BJP Says Focus On ‘Seva’ : మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని…దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. కరోనా సమయంలో సంబరాలు కాకుండా కోవిడ్ కట్టడి చేసే దిశగా కార్యక్రమలుంటాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూస్తోంది పార్టీ క్యాడర్‌. దేశంలోని ప్రతి డివిజన్‌లోనూ కనీసం 10 పోలింగ్ బూత్‌ల్లో సేవా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది.

బూత్‌ స్థాయి నేతలు మొదలు.. జాతీయ నాయకుల వరకు ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమై.. ప్రతి నాయకుడు కనీసం రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ నాయకత్వం ఆదేశాలిచ్చింది. తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు వారి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేసింది.

ఆకలితో ఉన్నవారికి భోజన వితరణ, ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాల పంపిణీ, కోవిడ్ బాధిత కుటుంబాలకు మెడికల్ కిట్లు, ఫేస్ మాస్కుల పంపిణీ, శానిటైజేషన్ అందివ్వనున్నారు బీజేపీ నేతలు. చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ బూస్టర్స్, బలవర్దకమైన ఆహార పదార్థాలు అందిస్తారు. అవసరమైన వారికి రక్తదానం, ప్లాస్మాదానం చేస్తారు.

Read More : 2 Doses Vaccination : రెండు డోసులు ఒకేసారి వేసేరంటూ మహిళ ఆందోళన..డోంట్ వర్రీ అంటున్న వైద్య సిబ్బంది

ట్రెండింగ్ వార్తలు