కరోనా వారియర్:రోడ్డుపై 75ఏళ్ల వృద్ధురాలి కర్రసాము…వైరల్ వీడియో

  • Publish Date - July 24, 2020 / 01:12 PM IST

రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు కర్రసాము విన్యాసం చూసినవారిని కదలనీయకుండా చేసింది. అంత పెద్ద వయస్సులో కూడా ఏమాత్రం తగ్గలేదామె. కళ్లు తిప్పుకోనివ్వని ఆమె విన్యాసం ఏదో..సరదా కోసమో..లేదా తన సత్తా తెలియజేయటానికో కాదు..పొట్టకూటికోసం. పూణె వీధులల్లో ఎర్రటి ఎండలో 75 ఏళ్ళ వృద్ధురాలి విన్యాసాల పట్ల బాలీవుడ్ నటుడు, జెనీలియా భ‌ర్త రితేశ్ దేశ్‌ముఖ్ ఆశ్చర్యపోయాడు. ఏమీ ఈమె చాతుర్యం?!..వృద్ధాప్యంలో కూడా ఇంతటి నైపుణ్యం..అంటూ ఆశ్చర్యపోయాడు. వృద్ధురాలి కర్రసాము వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్ చేస్తూ..ఆమెకు సాయం చేస్తానని తెలిపాడు. ఆమె వివరాలు తెలపాలని నెటిజన్లను కోరాడు.

దీంతో అది చూసిన కొందరు ఆ బామ్మ పేరు శాంతాబాయి అని..పూణెకు చెందిన మహిళ అని తెలపటంతో ఆమెకు సహాయం చేసే పనిలో ఉన్నాడు రితేష్. దీనిపై మరోసారి రితేశ్ స్పందిస్తూ.. శాంతాబాయ్‌కు సాయం చేసేందుకు త‌న సిబ్బందిని ఆమె వద్దకు పంపుతున్నానని చెప్పాడు. j

కరోనా కష్టాలు..లాక్ డౌన్ ఇబ్బందులతో 75 ఏళ్ల శాంతాబాబాయి మాస్క్ పెట్టుకుని రోడ్డు పక్కన నిలబడి..రెండు కర్రలు పట్టుకుని శాంతాబాయి సాము చేస్తుంటే కష్టాల కర్రసాము అని అనిపిస్తోంది. చాకచరక్యంగా కర్రసాము సరిగా చేయకపోతే తల పుచ్చకాయిలా పేలిపోతుంది. అత్యంత ప్రాచీనమైన కర్రసాము నేర్చుకోవటం చేయటం సాధారణ విషయం కాదు. కానీ శాంతాబాయి ఒకటి కాదు రెండు కర్రలతో చేసే కర్రసాము చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. అలా రోడ్డు పక్కన ఎర్రటి ఎండలో నిలబడి రెండు చేతులతో కర్రసాము చేసిన శాంతాబాయి కడుపు నింపుకోవటం కోసమేనంటూ పొట్ట పట్టుకుని దయచేసి సహాయం చేయండి అంటూ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.