Azadi Ka Amruthotsav
Azadi ka Amrutotsavam Special..Begum Hazrat Mahal : దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులను తలచుకుంటూ..వారు చేసిన పోరాటాలను స్మరించుకోవాలనే మంచి ఉధ్ధేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. ఆజాదీకా అమృతోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 75 వారాల పాటు ప్రతి వారం ఒక్కో కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే దేశ స్వాతంత్య్ర గురించి, దాని వెనకున్న అనేకమంది త్యాగాల గురించి ప్రతి రోజూ తెలుసుకోవటం ప్రతీ భారతీయుడు బాధ్యత..
భారతదేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో లక్షల మంది తమ ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి రాడారు. దేశానికి స్వేచ్ఛావాయువులు ప్రసాదించేందుకు మరెన్నో వేల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. అంతమంది త్యాగధనుల త్యాగాల ఫలితంగానే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సాధ్యమయ్యాయి. కుల మతాలకు అతీతంగా ఎంతోమంది స్వాతంత్ర్యం కోసం పోరాడారు..అటువంటివారిలో స్వంత్ర్యం పోరాటంలో పాల్గొన్న ముస్లిం మహిళల గురించి చెప్పుకోవాలి. వారిలో తొలి తరం మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్.
అందులో భాగంగా తొలిగా ముస్లిం మహిళ బేగం హజ్రత్ మహల్ గురించి చెప్పుకుని తీరాల్సిందే. హజ్రత్ మహల్ 1857లోనే భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. భారత స్వాతంత్ర్యోద్యమములో కీలకపాత్ర వహించారామె. రాజా జైలాల్ సింగ్ సారథ్యంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. 1820లో ఫైజాబాద్‌లో జన్మించిన బేగం హజ్రత్ మహల్ నవాబ్ వాజిద్ అలీ షాను వివాహమాడారు. బ్రిటీషు పాలకులు లక్నోని స్వాధీనం చేసుకున్నప్పుడు వాజిద్ అలీ షా వెళ్ళిపోవడంతో ఈవిడ అవధ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు స్వీకరించింది.
ఆ తర్వాత హజ్రత్ పలుమార్లు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆమె కీలక పోరాటాలు చేశారు. ఆ తరువాత నేపాల్‌లోని హల్లలూర్‌లో ఓ అసైలమ్‌ను ఏర్పాటు చేసి దానిని నడింపించారు. అక్కడే 1879లో మరణించారు. హజ్రత్‌కు బిర్జిస్ కాదిర్ అనే ఓ కుమారుడు ఉన్నాడు.
హజ్రత్ మహల్ అసలు పేరు మహమ్మది ఖనుమ్. అవధ్ లోని ఫైజాబాద్ లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక ఏజెంట్ ద్వారా అవివాద్ రాజుకు అమ్మివేయడంతో అక్కడ మహాఖిరిగా పిలవబడింది. ఆవాద్ రాజు ఈవిడను భార్యగా అంగీకరించాడు. వారికి ఓ కొడుకు పుట్టగా అతనికి బిర్జిస్ ఖాదర్ పేరు పెట్టారు. కొడుకు జన్మించిన తరువాత ఆమె పేరు హజ్రత్ మహల్ గా మార్చబడింది.
1857నాటి భారతీయ తిరుగుబాటు
1857 నుండి 1858 మధ్యకాలంలో జరిగిన భారతీయ తిరుగుబాటులో రాజా జైలాల్ సింగ్ నాయకత్వంలోని బేగం హజ్రత్ మహల్ సైన్యం బ్రిటిష్ దళాలపై తిరుగుబాటు చేసింది. లక్నోను స్వాధీనం చేసుకున్న తరువాత హజ్రత్ మహల్ తన కుమారుడైన బిర్జిస్ ఖద్రను అవధ్ యొక్క పాలకుడుగా ప్రకటించింది.
1879లో హజ్రత్ మరణం..
హజ్రత్ మహల్ అంతిమదశలో నేపాల్ కు చేరుకుంది. అక్కడ ఆమెకు ఆశ్రయం కలిపించడానికి దేశ ప్రధానమంత్రి జాంగ్ బహదూర్ ఒప్పుకోలేదు. తరువాత ఎట్టకేలకు అనుమతి లభించింది. అలా ఆమె చివరి రోజులు అక్కడే గడిచారు. అలా ఆమె 1879లో కన్నుమూసింది. ఖాట్మండు జమా మసీదులోని పేరులేని సమాధిలో ఖననం చేయబడింది.