First Woman CJI : 2027లో మొట్టమొదటి మహిళా సీజే ఎవరంటే? ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!

2027లో సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు. ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టుల జాబితాను కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది.

First woman CJI : దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 2027లో మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు.  ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ BV నాగరత్నకు ఈ ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టులకు సంబంధించి జాబితాను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది. ఈ జాబితాలో జస్టిస్ బీవీ నాగరత్న పేరును కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఈమె నియామకం ఖరారు అయితే మాత్రం 2027లో దేశీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీవీ నాగరత్న కానున్నారు. అంతేకాదు.. భారత ప్రధాన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన 9 మంది పేర్ల జాబితాలో మరో ఇద్దరు మహిళా న్యాయమూర్తుల పేర్లను కూడా కొలీజియం సిఫార్సు చేసినట్టు తెలిసింది.

అందులో హిమ కోహ్లీ (Hima Kohli), తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్, గుజరాత్ హైకోర్టు జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నట్టు తెలిసింది. అలాగే సీనియర్ అడ్వకేట్ PS నరసింహను నేరుగా నియమించాలంటూ కొలీజియం మొదటి ఎంపికలో సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇటీవలే జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ పదవీ విరమణ చేయగా.. భారతదేశ న్యాయ చరిత్రలో బార్ నుంచి నేరుగా నియమితులైన ఐదో న్యాయవాది కూడా. నారిమన్ తర్వాత నేరుగా నియమితులు కాబోయే న్యాయవాదిగా పీఎస్ నరసింహ నిలువనున్నారు. గుజరాత్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు విక్రమ్ నాథ్, జె.కె మహేశ్వరీలతో పాటు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ ఓకా పేరును కూడా కొలీజియం సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయితే ఈ తొమ్మిది మందిలో జస్టిస్ నాగరత్న సహా ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్లో ఒకరికి భారత ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది.
Supreme Court: ఎనిమిది రాజకీయ పార్టీలకు జరిమానా విధించిన సుప్రీంకోర్టు

నారిమన్ పదవీ విరమణతో ఖాళీగా 9 పోస్టులు :
సుప్రీంకోర్టులోని కొలీజియంలో CJI NV రమణ, న్యాయమూర్తులు ఉదయ్ యూ లలిత్, AM ఖన్విల్కర్, ధనంజయ వై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో పోస్టులకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి పేర్లను పంపడంలో ఏకాభిప్రాయానికి వచ్చిన గత 21 నెలల్లో మొదటి కొలీజియం కానుంది. జస్టిస్ రంజన్ గొగోయ్ 2019 నవంబర్‌లో CJIగా పదవీ విరమణ చేసినప్పటి నుంచి కొలీజియం అత్యున్నత న్యాయస్థానంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క సిఫారసు కూడా పంపలేదు. ప్రస్తుతం ఆగస్టు 12న జస్టిస్ నారిమన్ పదవీ విరణమణ తర్వాత తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. అదనంగా, జస్టిస్ నవీన్ సిన్హా ఆగస్టు 18న పదవీ విరమణ చేయనున్నారు.

మొత్తం 34మంది సుప్రీం న్యాయమూర్తుల్లో 10 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉండనున్నాయి. ఈ 10 ఖాళీలలో తొమ్మిది పేర్లు ఇప్పుడు కొలీజియం ద్వారా ఆమోదం లభించినట్టు తెలిసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 2022లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఎనిమిది మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే నియమితులయ్యారు. అయితే సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతారు. సిఫార్సులను తిరిగి కొలీజియంకు పంపడానికి అవకాశం ఉంది. కానీ కొలీజియం వాటిని తిరిగి సమర్పిస్తే.. ఆ పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది.
Amazon, Flipkart కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ట్రెండింగ్ వార్తలు