9 రాష్ట్రాలు..71 నియోజకవర్గాలు : 4వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

  • Publish Date - April 2, 2019 / 10:24 AM IST

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో 9 రాష్ట్రాల్లో 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 29న పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్ 02వ తేదీ నుండి అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన, ఏప్రిల్‌ 12వ తేదీ నామినేషన్లు ఉపసంహరణ గడువుగా విధించారు. 
Read Also : బస్సులో రూ.24లక్షలు : మహిళా మంత్రి అనుచరుడి నుంచి డబ్బు సీజ్

బీహార్‌లో 5 స్థానాలకు, ఝార్ఖండ్‌లో 3 స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలకు, మహారాష్ట్రలో 17 స్థానాలకు, ఒడిశాలో 6 స్థానాలకు, రాజస్థాన్‌లో 13 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు, పశ్చిమబెంగాల్‌లో 8 స్థానాలు..మొత్తం 71 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. మే 23న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే. 

ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత, ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also : మోడీకి సిగ్గు..లజ్జ లేదు.. అసమర్థుడు – బాబు ఘాటు వ్యాఖ్యలు