Fire Accident : బీహార్ లోని గయ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

అగ్నికిలలకు ఒక బోగీ మొత్తం తగలబడింది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Gaya

fire broke out at Gaya railway station : బీహార్ లోని గయ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ పై ఆగివున్న రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికిలలకు ఒక బోగీ మొత్తం తగలబడింది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.