మనిషి కాదు మృగం : కారుతో కుక్కను తొక్కించిన మాజీ పోలీస్‌ అధికారి

A former police officer kicked a dog with a car : బెంగళూరులో మాజీ పోలీస్‌ అధికారి మృగంలా మారాడు. రోడ్డుకు అడ్డంగా పడుకున్న కుక్కపై కర్కశంగా ప్రవర్తించాడు. కారుకు అడ్డం వచ్చిందంటూ కుక్క పైనుంచి కారును నడిపాడు. కారును ముందుకు వెనక్కు నడుపుతూ కుక్కను దారుణంగా తొక్కించేశాడు.

కుక్కపై కర్కశంగా విరుచుకుపడిన వ్యక్తిని మాజీ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నగేశ్‌గా గుర్తించారు. తన కారుకు అడ్డంగా వచ్చిందన్న కారణంతో కుక్కపై దుర్మార్గంగా ప్రవర్తించిన నగేశ్‌… కారుతో తొక్కించిన అనంతరం కూడా ఏమాత్రం జాలి లేకుండా, పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

ఈ ఘటనలో కుక్క తీవ్రంగా గాయపడింది. వెన్నెముకతో పాటు రెండుకాళ్లు విరిగిపోయాయి. ఈ నిర్వాకమంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీంతో నిందితుడు నగేశ్‌పై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అతడ్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.