man attacked
Man Attacked Boy : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఖండ్వాలో పదేళ్ల ముస్లిం బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్యూషన్ కు వెళ్తున్న ముస్లిం బాలుడిని 22 ఏళ్ల వ్యక్తి అడ్డగించి బాలుడిని జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేసి, వేధించాడు.
ఆ బాలుడు మౌనంగా ఉండటంతో అతనిపై చెంపపై కొట్టాడు. దీంతో మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
హర్యానాలో దారుణం : జై శ్రీరాం అనలేదని భార్యాభర్తలను కొట్టారు
బాలుడు ట్యూషన్ కు వెళ్తుండగా అజయ్ అలియాస్ రాజు భిల్ అనే వ్యక్తి అతడిని అడ్డగించి జై శ్రీరాం అనాలని బలవతం చేయడంతోపాటు దాడి చేశాడని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఖండ్వా డీఎస్ పీ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.