యువర్ఆనర్..ఈ ముద్దాయి అంటూ..కోర్టులో వాదించే లాయర్లు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారా? అనే ప్రశ్నకు ఇదిగో ఇటువంటి దృశ్యాలు చూస్తే లేదని చెప్పాల్సి వస్తుంది. న్యాయస్థానం అంటే అందరికీ సమానంగా న్యాయాన్ని ఇచ్చే స్థానం. అటువంటి న్యాయస్థానంంలో నీతులు వల్లించే లాయర్లు అది మాకు మాత్రం వర్తించదన్నట్లుగా ప్రవర్తించాడు ఓ న్యాయవాది. సాక్షాత్తూ రాజస్థాన్ హైకోర్టు వర్చువల్ హియరింగ్ లో ఓ లాయర్ హుక్కా తాగుతూ విలాసంగా..నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కెమెరాకు చిక్కింది. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియోలో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. విచారణలో కాంగ్రెస్ పార్టీ కపిల్ సిబాల్ వాదిస్తుండగా..సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా గుప్పుగుప్పున వదులుతూ కనిపించాడు. కాగితాలు అడ్డంగా పెట్టుకుని ఎవరికీ కనిపించదనే ధీమాతో పనికానిచ్చేశాడు. కానీ పొగ మాత్రం గుప్పు గుప్పుమని పైకి వచ్చింది.
వర్చువల్ హియరింగ్ సమయంలో లాయర్ ధూమపానం చేసిన సంఘటన రాజస్థాన్ హైకోర్టు నోటీసు ఇచ్చిందో లేదో స్పష్టంగా లేదు.
ఈక్రమంలో శుక్రవారం (ఆగస్టు 14,20200 విచారణ తిరిగి ప్రారంభించగానే సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వీడియో మాత్రం కనిపించలేదు.
కరోనావైరస్ తో వచ్చిన లాక్డౌన్ కోర్టులను ఆన్‌లైన్ లోనే ముఖ్యమైన కేసుల్ని వాదిస్తున్నాయి. కానీ ఆన్ లైన్ లో కేసుల విచారణ జరిగినా..దాంట్లో పాల్గొన్నవారు కోర్టులో ఉన్నట్లుగా సమానం. కాబట్టి “కనీస కోర్టు మర్యాదలు” పాటించాలి. కానీ అటువంటివేవీ జరగటంలేదు.ఇలాగా ఓ కేసులో ఆన్ లైన్ లో వాదిస్తున్న సుప్రీంకోర్టులో వర్చువల విచాణలో భాగంగా ఓ న్యాయవాది టీషర్టు వేసుకుని..మంచంమీద పడుకుని..మరీ కేసును వాదించాడు. ఇటువంటివి న్యాయస్థానాలను అగౌరపరచటమేనని ఎస్సీ అభిప్రాయపడింది.
ఇదిలా ఉండగా అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం అసెంబ్లీలోని బలం నిరూపించుకోవాని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే సచిన్ పైలెట్ బెట్టువీడడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ముప్పు తప్పిందనే చెప్పాలి. కానీ పార్టీ అంటే గౌరవం లేని ఇటువంటి నాయకులతో ఏపార్టీకైనా సరే ముప్పు ఎప్పటికీ పొంచి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.