strange baby born: మధ్యప్రదేశ్‌లో వింత శిశువు జననం.. పూర్తి ఆరోగ్యంగా పసికందు

ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్కేఎస్ థకడ్ మాట్లాడుతూ.. శిశువు ఇలా జన్మించడాన్ని ఇస్కియోపాగస్ అంటారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందిందని తెలిపారు.

strange baby born: మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్ జిల్లాలో మహిళ వింత శిశుకు జన్మనిచ్చింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా బుధవారం స్థానిక కమలరాజా ఆస్పత్రిలోని మహిళ శిశు వైద్య విభాగంలో పాపకు జన్మనిచ్చింది. శిశువు బరువు 2.3 కిలోలు ఉంది. అయితే ఆ శిశువు వింత ఆకారంలో జన్మించడంతో ఆందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శిశువు ఆరోగ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Strange Object Landed in Vikarabad : ఆకాశం నుంచి వికారాబాద్ పంటపొలాల్లో పడిన వింత వస్తువు .. భయాందోళనలో గ్రామస్తులు

శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఈ శిశువును పరీక్షించిన వైద్యులు పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పీడియాట్రిక్ డిపార్ట్ మెంట్ వైద్యులు శిశువు శరీరంలో ఏదైనా ఇతర వైకల్యం ఉందా అనే విషయాలపై పరీక్షిస్తున్నారు. అయితే, శిశువుకు అదనంగా వచ్చిన కాళ్లు పనిచేయడం లేదని గుర్తించారు.

ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్కేఎస్ థకడ్ మాట్లాడుతూ.. శిశువు ఇలా జన్మించడాన్ని ఇస్కియోపాగస్ అంటారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అయితే ఇవి పనిచేయడం లేదని, వీటిని ఆపరేషన్ ద్వారా తొలగిస్తే శిశువు సాధారణ జీవితాన్ని గడపగలదు అని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు