Rajasthan: బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి.. కాపాడేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు

రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

Rajasthan: రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో దౌసా జిల్లా బండికుయ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రెండేళ్ల చిన్నారి అంకిత ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ 200 అడుగుల లోతైన బోరుబావిలో జారిపడింది.

Dunzo Agent Run Behind Train: నువ్వు గ్రేట్ సామి..! రైలు వెంట పరుగెత్తి కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేసిన డన్జో ఏజెంట్.. వీడియో వైరల్ ..

చిన్నారి కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు వెతుకగా బోరుబావిలో పడినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. బోరుబావి 200 అడుగుల లోతు ఉంది. 100 అడుగుల లోతులో పాప ఇరుక్కొని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యల కోసం ఘటన స్థలానికి ప్రత్యేక యంత్రాలు, ట్రాక్టర్లను తరలించారు.

Roger Federer: రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్.. 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై!

బోరుబావిలో 100 అడుగు లోతులో ఉన్న అంకితకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఆ చిన్నారి నుంచి ఎలాంటి కదలికలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. జైపూర్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి బోరుబావిలో పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు