Mother Love : ఎంత కష్టం తల్లీ .. పసిగుడ్డును ఒడిలో పెట్టుకుని రిక్షా నడుపుతున్న యువతి

కన్నతల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందీ వీడియో. తల్లి పేదదే అయినా బిడ్డ ఆకలి తీర్చాలి.దాని కోసం ఏదైనా చేయాలి. ఎంత కష్టమైనా పడాలి..అందుకే ఈ తల్లి పడే కష్టం చూస్తే మనస్సు చలించిపోతోంది. ఎంత కష్టం తల్లీ నీకు అనిపిస్తోంది.

woman driving rickshaw with toddler

woman driving rickshaw with toddler : అమ్మ అనే మాటకు..ఆమె చూపించే ప్రేమను చాటి చెప్పటానికి ఈ ప్రపంచంలోనే ఉన్న ఏ భాష సరిపోదు. అక్షరాల్లో చూపించలేని అనిర్వచనీయమైన..అనితరసాధ్యమైనది అమ్మ ప్రేమ. ప్రేమ అంటేనే అమ్మ..అటువంటి అమ్మ తన కడుపు మాడ్చుకుని అయినా బిడ్డ కడుపు నింపుతుంది. అమ్మకు పేదా గొప్పా తేడా లేదు. కడుపున పుట్టిన బిడ్డను పెంచటానికి అమ్మ ఏమైనా చేస్తుంది. తన రక్తాన్ని పాలగా మార్చి బుజ్జాయి బుజ్జి పొట్టను నింపుతుంది. మరి బుజ్జాయి చిరుబొజ్జ నిండాలంటే ఆ తల్లి కూడా పిడికెడు మెతుకులైనా తినాలి. పేద తల్లి కడుపు నిండాలంటే కాయ కష్టం చేయాల్సిందే.

Ajit Agarkar Love Story : బీసీసీఐ కొత్త సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్, ముస్లిం గాళ్‌ఫ్రెండ్ ప్రేమ కథ

భగ భగలాడే ఎండలో అయినా..భారీ వర్షంలోనే అయినా..వణికించే చలిలో అయినా తల్లి కష్టపడాల్సిందే. అటువంటి ఓ తల్లి ఓ పసిగుడ్డును ఒడిలో పెట్టుకుని రిక్షా నడుపుతున్న దశ్యం చూసేవారిని కలచివేస్తోంది. ఎంత కష్టం తల్లీ నీకు అనిపిస్తోంది. కానీ ఆ తల్లి మాత్రం బిడ్డ కోసం కష్టపడుతోంది.రిక్షా నడుపుతోంది.. బిడ్డను వడిలో పెట్టుకొని జీవనోపాధి కోసం రిక్షా నడుపుతోంది. ఈ తల్లీ కష్టానికి కరిగిపోయిన ఎవరో బిడ్డను ఒడిలో పెట్టుకుని రిక్షా నడుపుతున్న తల్లి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అవుతున్నాయి. అది చూసిన అందరు ఎంత కష్టం తల్లీ నీకు అంటున్నారు.

Aggressive Stray Dogs : వీధి కుక్కల కాటుకు కళ్లెం వేసేందుకు వినూత్న ప్రణాళిక

ఈ-రిక్షా డ్రైవర్‌గా ఆ తల్లి నెట్టింట వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్ చేశారు. ఓ అమ్మ తన వాహనంలో కూర్చొని కస్టమర్‌లతో బేరసారాలు సాగిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నిశితంగా పరిశీలిస్తే ఆమె ఒడిలో ఓ పసిబిడ్డ ఉన్నట్లుగా కనిపిస్తోంది.కొన్ని క్షణాల తర్వాత, ఆ స్త్రీ అక్కడి నుండి దూరంగా వెళ్లి, పిల్లవాడిని తన ఒడిలో జాగ్రత్తగా ఉంచుకుంది. ఈ వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఆమె పడుతున్న కష్టానికి, ఆమె తల్లి మనసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అదే మరి అమ్మ ప్రేమ అంటే..