Aadhaar Card Update: ఆధార్‌లో ఫోటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ప్రాసెస్ ఇదే! తెలుసుకోండి

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు కీలకమైన పత్రాల్లో ఒకటిగా మారింది. ప్రభుత్వ అందించే అనేక సేవలను పొందేందుకు ఆధార్ కచ్చితంగా అవసరం అవుతోంది.

Aadhaar Card Update: ఆధార్ కార్డు అనేది ఇప్పుడు కీలకమైన పత్రాల్లో ఒకటిగా మారింది. ప్రభుత్వ అందించే అనేక సేవలను పొందేందుకు ఆధార్ కచ్చితంగా అవసరం అవుతోంది. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కచ్చితంగా కావల్సిందే. వివిధ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందేందుకు, ప్రభుత్వం ఆధార్ కార్డును కంపల్సరీ చేసేసింది.

అయితే, ఆధార్ కార్డులో ఫోటోలు చాలామందికి నచ్చనివే ఉంటాయి. ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా లేదన్న అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. నెట్టింట్లో ఆధార్ కార్డు ఫోటోలపై ట్రోల్స్ చూస్తూనే ఉంటాం కదా? ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చినట్టే, ఫోటోను కూడా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే చాలావరకు వివరాలను అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది UIDAI. అయితే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయాలంటే మాత్రం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే.

Step 1: అఫిషియల్ UIDAI పోర్టల్, uidai.gov.inకి వెళ్లండి.

Step 2: మీ ఆధార్ కార్డ్‌లోని ఫోటోని మార్చడానికి ఫారమ్‌ను పూరించండి.

Step 3: సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.

Step 4: ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌కు ఫారమ్‌ను సమర్పించండి.

Step 5: ఆధార్ కేంద్రానికి రూ. 25 రుసుము చెల్లించండి.

Step 6: అక్కడి అధికారి మీ కొత్త ఫోటోగ్రాఫ్‌ను క్లిక్ చేసి, దానిని ఆధార్ కార్డ్‌కి అప్‌లోడ్ చేస్తారు.

Step 7. ఎగ్జిక్యూటివ్ మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) మరియు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను అందిస్తారు.

Step 8. మీరు URNని ఉపయోగించి UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు. My Aadhaar సెక్షన్‌లో Update Your Aadhaar లో Check Aadhaar Update Status పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, URN ఎంటర్ చేస్తే ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు