Electoral Reform Proposals : ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌!

ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓటర్ ఐడీతో లింకు చేయడంతో పాటు కొత్త ఎన్నికల సంస్కరణలను కూడా తీసుకొస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Electoral Reform Proposals : ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓటర్ ఐడీతో లింకు చేయడంతో పాటు కొత్త ఎన్నికల సంస్కరణలను కూడా తీసుకొస్తున్నట్టు బుధవారం కేంద్రం ప్రకటించింది. 2022లో ఎన్నికలకు ముందుగానే ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలను చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానానికి నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలనేది అందరికి తెలిసిందే.

అయితే.. ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకునే వీలుంది. దీనిపై స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతోంది. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి, 18 ఏళ్లు వయస్సు నిండిన వారంతా నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో ఏడాదికి 4 సార్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సర్వీసు ఓటర్లుగా భాగస్వామి పనిచేసే ప్రాంతంలో వారి జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకునే వీలు ఉంటుంది. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏ ప్రాంతాన్ని అయినా స్వాధీనం చేసుకునేందుకు అన్ని అధికారాలను ఎన్నికల కమిషన్‌కి ఇచ్చింది.

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల నిర్వహణ కోసం ఎంపిక చేసే పాఠశాలలు, ముఖ్యమైన సంస్థలను ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. ఇలాంటి వాటికి సంబంధించి అన్నింటిపై కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read Also : ORR LED Lights : ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించనున్న కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు