కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా 

  • Publish Date - April 25, 2019 / 11:23 AM IST

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నజర్ సింగ్ మన్షాహియా గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరటాన్ని సీఎం అమరీందర్ సింగ్ సాదరంగా స్వాగతించారు. నజర్ రాకతో కాంగ్రెస్‌కు మరింత బలం పెరిగిందని అన్నారు.

లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నజర్ సింగ్ ఆప్ కు గుడ్ చెప్పటం ఆ పార్టీకి గట్టి దెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురునానక్ దేవ్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నజర్ సింగ్ మన్షాహియా రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో పని చేశారు.