Aayushman Bharat Scheme : ఆర్మీకి కూడా ఆయుష్మాన్ భారత్ పతకం వర్తింపు

సైనికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రధాని చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పతకాన్ని ఆర్మీకి వర్తింపజేస్తామన్నారు.

Aayushman Bharat scheme applicable to Army : సైనికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రధాని చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పతకాన్ని ఇకపై నుంచి ఆర్మీకి వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్‌లకూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు.

త్వరలోనే ఆర్మీకి, వారి కుటుంబాలకు ప్రత్యేక ఆయుష్మాన్ కార్డును అందిస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రతి సైనికుడు, వారి కుటుంబం ఆయుష్మాన్ కార్డు ద్వారా హాస్పిటల్‌లో ఉచితంగా చికిత్స పొందవచ్చునని వివరించారు.

Omicron In India : భారత్‌లో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్

రాజస్థాన్‌ జై సల్మేర్‌లోని రొహితాష్‌ సరిహద్ద వద్ద జవాన్లను కేంద్ర హోంమంత్రి కలిశారు. వారితో కలిసి భోజనం చేశారు. శనివారం రాత్రి ఆయన సరిహద్దులో ఆర్మీ పెట్రోలింగ్‌ను దగ్గర ఉండి పరిశీలించారు. అక్కడే ఆయన బస చేశారు. సైనికులు సరిహద్దులో కాపలా కాస్తుండడంతోనే తనతోపాటు 130 కోట్ల మంది భారతీయులు నిశ్చింతగా నిద్రిస్తున్నారని వివరించారు.

ప్రతీ భారతీయుడికీ ఆర్మీపై బలమైన నమ్మకం ఉందని అమిత్‌ షా తెలిపారు. ఇవాళ జైపూర్‌లో పార్టీ కార్యకర్తలతో అమిత్‌ షా సమావేశం కాబోతున్నారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే రాజస్థాన్‌లోని బీజేపీలో రచ్చకెక్కిన విభేదాలను పరిష్కరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు