శిక్షణ లేకుండా..పనికిరాని వస్తువులతో ఎలక్ట్రిక్ బైక్స్

గుజరాత్‌లోని సూరత్‌లో 60 ఏళ్ల ఓ దివ్యాంగుని పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పేరు విష్ణు పటేల్, అతను మెకానికల్ ఇంజినీర్ కాదు,

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 12:16 PM IST
శిక్షణ లేకుండా..పనికిరాని వస్తువులతో ఎలక్ట్రిక్ బైక్స్

గుజరాత్‌లోని సూరత్‌లో 60 ఏళ్ల ఓ దివ్యాంగుని పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పేరు విష్ణు పటేల్, అతను మెకానికల్ ఇంజినీర్ కాదు,

గుజరాత్‌లోని సూరత్‌లో 60 ఏళ్ల ఓ దివ్యాంగుని పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పేరు విష్ణు పటేల్, అతను మెకానికల్ ఇంజినీర్ కాదు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్‌ల్లో ఎలాంటి తర్ఫీదు పొందలేదు. పైగా అతనికి పోలియో, చెవుడు కూడా ఉన్నాయి. కానీ ఈ సమస్యలేవీ అతన్ని కుంగదీయలేదు. తనలాంటి దివ్యాంగులకు ఏదైనా చేయాలనే తపన అతన్ని సరికొత్త ఆలోచనలకు పురికొల్పింది. పోలీయో వల్ల బాల్యంలోనే అతని కాళ్లు వంకర్లు తిరిగిపోయాయి. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ద్విచక్ర – త్రిచక్ర వాహనాలను తయారు చేయాలని నిర్ణయించాడు. వ్యర్థంగా పడేసే మోటర్ సైకిల్ పార్టులతో ఇ-బైక్‌లను తయారు చేసాడు.  
Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్‌ తరహాలో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్లు
 
పటేల్ తయారుచేసిన ఏడు వాహనాల్లో రెండిటిని ఇ-బైక్‌లుగా మార్చేశాడు. సాధారణంగా ఒక బ్యాటరీ వాహనాన్ని తయారు చేయాలంటే ఎంతో శిక్షణ ఉండాలి. కానీ, పటేల్ యూట్యూబ్‌లో వాహనాలను తయారు చేసే విధానాన్ని చూశాడు. అప్పటి నుంచి తనకు సొంతంగా వాహనాలు తయారు చేయాలనే ఆలోచన కలిగిందని పటేల్ చెప్పాడు. పటేల్ తయారుచేసిన బ్యాటరీ వాహనాన్ని 2-3 గంటలు ఛార్జింగ్ చేస్తే 35 నుంచి 45 కిమీలు ప్రయాణం చేయొచ్చు. 

దివ్యాంగులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు అనువుగా ఒక ఇ-బైక్‌ను తయారు చేయాలని నిర్ణయించామని, ఒక్కో వాహనం తయారీకి సుమారు రూ.25 వేలు వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వం సాయం చేస్తే ఇలాంటి వాహనాలను మరిన్ని తయారు చేసి దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Read Also : షాపింగ్ మాల్‌లో ప్రపోజ్.. ప్రేమ జంటకు పోలీసుల ట్విస్ట్