Republic Day 2024: రిపబ్లిక్ డే.. 1927 నుంచి 1949 వరకు ఏం జరిగిందో తెలుసా?

భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు. ఏయే ఏడాది ఏం జరిగింది?

భారతదేశ చరిత్రలో 1950, జనవరి 26 భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మన దేశాన్ని పరిపాలించారు.

దేశ చరిత్రలో దాదాపు 200 సంవత్సరాలపాటు కొనసాగిన బ్రిటీష్‌ పరిపాలనకు చరమగీతం పాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న తెల్లదొరల పాలన నుంచి విముక్తి చెందిన భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం.

దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. 1950, జనవరి 26న భారత రాజ్యాంగం పురుడు పోసుకుంది. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా రూపుదాల్చింది. ఆ రోజు నుంచి భారత్ పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.

గణతంత్ర రాజ్యాలన్నిటిని కలిపి భారతదేశంగా ప్రకటించడానికి  దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రిపబ్లిక్ డే (1927 నుంచి 1949 వరకు) అవతరణ ఇలా జరిగింది.

1927: ఇతర నాయకులతో పాటు భగత్ సింగ్ ‘పూర్తి స్వేచ్ఛ’ చొరవ తో ముందుకు వచ్చింది. ఈ ఆలోచన జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్ వంటి యువ కాంగ్రెస్ నాయకులు ప్రేరణతో ముందుకు సాగింది.

1928: ఒక తీర్మానాన్ని ‘అధినివేశ ప్రతిపత్తిని’ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమోదించింది. కానీ బ్రిటిష్ భారతదేశం అధినివేశ ప్రతిపత్తిని కోసం సామర్థ్యం లేదని పేర్కొంటూ తిరస్కరించింది.

1929: లాహోర్ హైకోర్టు, కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. అదే సమయంలో పూర్ణ స్వరాజ్, అనగా సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండ్ చేశారు.

1930: వేడుకల సందర్భంలో, జనవరి చివరి ఆదివారం 26న స్వాతంత్ర దినోత్సవం నెహ్రూ లాహోర్లో రావి నది ఒడ్డున జెండా ఆవిష్కరణ జరిగింది.

1947: ఆగష్టు 15 నుంచి బ్రిటీషు పాలన నుంచి భారతదేశం పూర్తి స్వేచ్ఛ పొందింది.

1949: భారత రాజ్యాంగ ఆవిర్భావం నవంబర్ 26. తొలి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో  (జనవరి 26, 1930) రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అదే రోజున రిపబ్లిక్ డే జరుపుకోవాలనే   నిర్ణయం వెలువడింది.

అలా రెండు నెలల పాటు వేచిచూసిన తరువాత ప్రతి ఏడాది జనవరి 26 న దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకులను జరుపుకుంటున్నాం.

Republic Day Movies : రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు