Republic Day Movies : రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
రిపబ్లిక్ డేకి పెద్ద తెలుగు సినిమాలేవీ లేకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
Republic Day Movies : సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చి సందడి చేశాయి. థియేటర్లలో ఇంకా సంక్రాంతి సినిమాలు ఆడుతూ కలెక్షన్స్ కురిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ అయిపొయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే సీజన్ రాబోతుంది. రిపబ్లిక్ డేకి పెద్ద తెలుగు సినిమాలేవీ లేకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
తమిళ్ లో సంక్రాంతికి రిలీజయిన ధనుష్(Dhanush) కెప్టెన్ మిల్లర్(Captain Miller) సినిమా, శివ కార్తికేయన్(Siva Karthikeyan) అయలాన్(Ayalaan) సినిమా అప్పుడే తెలుగులో రిలీజ్ అవుదాం అనుకున్నా థియేటర్లు లేవు కాబట్టి రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఆ రెండు సినిమాలు తమిళ్ లో పర్వాలేదనిపించి ఇప్పుడు రిపబ్లిక్ డేకి తెలుగులో రానున్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇందులో మన సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేసాడు.
ఇక శివకార్తికేయన్, రకుల్ జంటగా ఓ ఏలియన్ కథాంశంతో తెరకెక్కిన సైఫై కామెడీ సినిమా అయలాన్ జనవరి 26న రిలీజ్ కానుంది.
హన్సిక మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా 105 మినిట్స్ కూడా 26న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హన్సిక ఒక్కటే నటించడం విశేషం. ఒక్క క్యారెక్టర్ తోనే సినిమాని నడిపించారు.
వీటితో పాటు బిఫోర్ మ్యారేజ్, ప్రేమలో, మూడో కన్ను, రామ్..అనే పలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ సినిమా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా తెరకెక్కిన ఫైటర్ సినిమా మొదట తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నా ఇప్పుడు తెలుగు రిలీజ్ లేదని సమాచారం. డైరెక్ట్ హిందీ సినిమానే ఇక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.