Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 5,748 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,41,840కు చేరుకుందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని చెప్పింది.

Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 5,748 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,41,840కు చేరుకుందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని చెప్పింది.

ప్రస్తుతం దేశంలో 46,389 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది. నిన్న దేశంలో 89.06 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. నిన్న 3,14,692 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 215.98 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది.

వాటిలో 94.59 కోట్ల సెకండ్ డోసులు, 18.98 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 31,09,550 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు చెప్పింది.

Taliban on Masood Azhar: మసూద్‌ అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడంటూ పాక్ ప్రకటన.. స్పందించిన తాలిబన్లు

ట్రెండింగ్ వార్తలు