మోడీపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్

  • Publish Date - January 6, 2020 / 02:36 PM IST

బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్  ఎంత గొప్పనటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో … వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదే స్ధాయిలో పేరు పొందారు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్టు చేశారు. 

మోడీకి హిట్లర్ కు తేడా లేదంటూ ఆ వీడియో సాగింది. ఈవీడియోలో మోడీ హిట్లర్ ఫోటోలు ఉన్నాయి. 24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో మోదీ, హిట్లర్‌ లకు చెందిన పలు ఫోటోలు ఉన్నాయి. వీరిద్దరూ చేసిన కొన్ని పనుల్లో సారుప్యత కల ఫోటోలు ఉన్నాయి. 

కాగా ప్రకాశ్‌ రాజ్‌  గతంలోనూ మోడీపై అనేక సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వివాదాస్పద విమర్శలు చేసారు.  గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి మోదీపై విమర్శలకు దూరంగా ఉన్న ప్రకాశ్‌.. ఇప్పుడుతన తాజా  వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు.