Military Colleges : మిలటరీ కాలేజీల్లో బాలికలకు అడ్మిషన్లు

రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే బాలికలు అడ్మిషన్‌ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Military

Admissions for girls : రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే బాలికలు అడ్మిషన్‌ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబరు 18న నిర్వహించే ప్రవేశ పరీక్షను బాలికలూ రాసేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఈ ఏడాది పరీక్షకు ఏర్పాట్లు జరిగిపోయాయని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం తొలదశ భర్తీలో 250 ఉన్న సీట్ల సంఖ్య 3 వందలకు పెంచాల్సి ఉంటుందని…అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. దీంతో 2023 జనవరి నుంచి బాలికలకు అడ్మిషన్లకు అనుమతిస్తామని కోర్టును అభ్యర్థించారు. రెండో దశలో కెపాసిటీ మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామని…ఇలా మొత్తం కాలజేల్లో అమ్మాయిల సంఖ్యను అనుగుణంగా పెంచే విధంగా చూస్తామన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. వారిని ఈ ఏడాది నుంచే అనుమతించాలని ఆదేశించింది.

Earthquake: లడఖ్‌లో భూకంపం

దేశ భద్రతలో మహిళలను మరింత భాగస్వామ్యం చేసేందుకు ఇప్పటికే…నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశం కల్పించారు. తాజాగా మిలటరీ కాలేజీల్లో అడ్మిషన్‌కు అనుమతించనున్నారు.