Admissions : అజీం ప్రేమ్ జీ యూనివర్శిటీలో పీజీ లో ప్రవేశాలు

ఈ కోర్సుకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Azim Premji

Admissions : అజీం ప్రేమ్ జీ విశ్వవిద్యాలయంలో 2022 విద్యాసంవత్సారానికి పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. యూనివర్శిటీ అందిస్తున్న ప్రోగ్రామ్ లకు సంబంధించి ఎంఏ డెవలప్ మెంట్, ఎంఏ ఎకనమిక్స్, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎల్ ఎల్ ఎం లా డెవలప్ మెంట్ తదితర కోర్సులు ఉన్నాయి.

ఈ కోర్సుకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా ఫిబ్రవరి 28, 2022గా నిర్ణయించారు. నేషనల్ ఎంట్రన్స్ పరీక్షను మార్చి 13, 2022 నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://azimpremjiuniversity.edu.in/