African Swine Flu : త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ కలకలం..!

African Swine Flu : త్రిపురలో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ (ASF) కలకలం రేపుతోంది. సెపాహిజాలా జిల్లా ప్రాంతంలో పందుల్లో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారులు గుర్తించారు.

African Swine Flu : త్రిపురలో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ (ASF) కలకలం రేపుతోంది. సెపాహిజాలా జిల్లా ప్రాంతంలో జంతు వనరుల అభివృద్ధిశాఖ (ARDD) నిర్వహిస్తున్న ఫారంలో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ కేసులను గుర్తించారు. ఈ మేరకు త్రిపుర అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఈ ఫ్లూ బారినపడి 63 వరకు పందులు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. అగర్తలలోని నిపుణుల బృందం సోమవారం ఫామ్‌కు చేరుకొని అక్కడి పరిస్థితులను సమీక్షించింది. త్రిపురలో పరిస్థితులను అంచనా వేసేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది.

ఏప్రిల్ 7న 3 శాంపిల్స్ సేకరించిన బృందం పరీక్షల కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీ (NERDDL)కి పంపింది. ఏప్రిల్ 13న PCR ఫలితాలు వచ్చాయి. అందులో అన్ని శాంపిల్స్‌ పాజిటివ్‌గా (ASF) ఉన్నట్లు నిర్ధారించారు. పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని పరిశోధక బృందం గుర్తించింది. అయితే ఈ స్పైన్ ఫ్లూ పందుల ఫారమ్ లోని అన్ని పందులకు వ్యాపించే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని డిసీజ్ టెస్టింగ్ లాబొరేటరీ సీనియర్ అధికారి అందించిన వివరాల ప్రకారం.. ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ పూర్తి నిర్ధారణకు సంబంధించి మరో రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్స్‌ నుంచి రిపోర్టు వచ్చినా తర్వాత అది ఏ ఫ్లూ అనేది కచ్చితమైన సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు పందులను వధించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

Read Also :  Swine Flue : గాంధీలో స్వైన్ ఫ్లూతో మృ‌తి

ట్రెండింగ్ వార్తలు