TikTok బ్యాన్ : ఇక ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల్లో సందడి చేస్తామంటున్న TikTok స్టార్స్

  • Publish Date - July 1, 2020 / 03:10 PM IST

భారత్-చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న క్రమంలో భారత్ చైనాకు బుద్ది చెప్పే భాగంలో TikTok తో సహా 59 చైనా యాప్ లను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం సోమవారం(జూన్29,2020) ప్రకటించింది.
ఈ TikTok యాప్ తో భారత్ లో TikTok స్లార్లుగా పేరు పొందినవారు తమ అభిమానులను దగ్గరయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు.

TikTok భారత్ లో అత్యంత క్రేజ్ ఉన్నా యాప్. ఇంతి ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొత్తదనంతో ఒకరిని మించి మరొకరు సరికొత్త వీడియోలతో వ్యూవర్స్ క్రేజ్ సంపాదించుకోవటానికి సాహసాలే చేసేవారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.
భారత్ లో ఇంత క్రేజ్ సాధించిన ఈ యాప్ బ్యాన్ తో టిక్ టాక్ స్టార్లు తమ అభిమానులను ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో ఫాలో కావాలని కోరుతున్నారు. ఎందుకంటే తమ వినూత్న వీడియోలతో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ TikTok స్టార్లు తమ అభిమానులను వదులుకోవటానికి సిద్దంగా లేరు. ఎందుకంటే అదొక క్రేజ్ కోసం ఏదైనా చేసేస్తారు ఈ స్టార్లు. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నారు. దీంతో క్రమంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ కు క్రేజ్ బాగా పెరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది.

TikTok యాప్ బ్యాన్ చేసిన కొన్ని గంటల తర్వాత టిక్ టాక్ స్టార్లు తమ అభిమానులను కనెక్ట్ అవ్వటానికి వారి ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలకు సంబంధించిన తమ హ్యాండిల్స్ ను పంచుకున్నారు. ఇప్పటికే కొంతమంది ఇన్‌స్టా ఎలా ఉపయోగించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టిక్‌టాక్ వినియోగదారులు ఇన్‌స్టా‌ లైవ్ ద్వారా తమని ఫాలో కావాలని, యూట్యూబ్‌లో తమ వీడియోలను చూడమని కోరుతుండటం విశేషం.

Read:టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ ‘ఛట్‌పట్‌’