శ్రామిక్‌ ట్రైన్లలో వారు ప్రయాణించొద్దు: రైల్వేశాఖ

  • Publish Date - May 29, 2020 / 08:00 AM IST

వలస కార్మికుల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్‌ ట్రైన్లలో ముందస్తు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజులుగా వలస కార్మికుల మరణాలు రైళ్లలె ఎక్కువగా నమోదు అవుతుండడంతో రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను రైళ్ళలో ప్రయాణించకుండా ఉండమంటూ  సలహా ఇచ్చింది. 

భారతీయ రైల్వేలో వలసదారులు తమ ఇళ్లకు తిరిగి ప్రయాణించేలా దేశవ్యాప్తంగా రోజూ శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయితే మే 27 నుంచి మొదలుకొని 48 గంటల్లో మార్గమధ్యంలోనే తొమ్మిది మంది చనిపోగా.. రైల్వే మంత్రిత్వ శాఖ ఒక విజ్ఞప్తి చేస్తుంది.

రక్తపోటు, డయాబెటిస్, కార్డియో-వాస్కులర్ వ్యాధులు, క్యాన్సర్, రోగనిరోధక లోపం ఉన్నవారు… గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రైలు ప్రయాణం చెయ్యవద్దని కోరింది. అవసరమైతే తప్ప ప్రయాణించవద్దని కోరింది రైల్వేశాఖ. ఈమేరకు 138 మరియు 139 హెల్ప్‌లైన్ నంబర్లలో అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని రైల్వేశాఖ ప్రజలను కోరింది.

ఇదిలావుండగా, మే 1 నుంచి మే 27 వరకు 3700 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని, 50 లక్షలకు పైగా వలసదారులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నామని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read: బాబోయ్..క్వారంటైన్ లో బకాసురుడు..10మంది ఫుడ్ ఒక్కడే తినేస్తున్నాడు