×
Ad

Aghori Manikandan : అఘోరాను పెళ్లి చేసుకున్న మహిళ

ఓ అఘోరాను ఓ మహిళ వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

  • Published On : November 22, 2021 / 08:52 PM IST

Aghora

Aghori Manikandan Marriage : అఘోరాలు వింతరూపంతో కనిపిస్తుంటారు. భారీగా పెరిగిన జట్టు..ఒళ్లంతా బూడిద రాసుకోవడం, కొంతమంది బట్టలు ధరించకుండా ఉండడం..ప్రతి విషయంలో ఎంతో విభిన్నంగా ఉంటుంటారు. వీళ్లు అంటేనే చాలా మందికి వణుకు పుడుతుంటుంది. అయితే…ఓ అఘోరాను ఓ మహిళ వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా అరియమంగళానికి చెందిన మణికందన్ అఘోరా.

Read More : Banjara Hills : బంజారాహిల్స్ లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం

కాశీలో అఘోరాగా ఉపాసన చేశాడు. తర్వాత సొంత గ్రామానికి వచ్చి జై అఘోరా కాళీమాత విగ్రహం ఏర్పాటు చేశాడు. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ఇతడికి కలకత్తాకు చెందిన మహిళను వివాహమాడారు. ప్రియాంక అనే మహిళ 8 సంవత్సరాలుగా మణికందన్ వద్ద అఘోరాలకు శిక్షణనిస్తున్నారు. మణికందన్ తో ప్రియాంక…2021, నవంబర్ 21వ తేదీ ఆదివారం తెల్లవారుజామున వీరి పెళ్లి జరిగింది. ప్రియాంక శరీరం కూడా అఘోరాలాగానే ఉంది.

Read More : Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

మణికందన్ ఆమె మెడలో తాళి కట్టగానే..అక్కడున్న ఇతర అఘోరాలు, పూజారి వీరిని ఆశీర్వదించారు. పెళ్లి చేసుకున్న అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు యజ్ఞం నిర్వహించారు. మృందంగం మోగిస్తూ..తోటి అఘోరాలు శంఖం ఊదారు. కళ్యాణం అనంతరం మరోసారి యజ్ఞం నిర్వహించి వారి స్టైల్లో హోమానికి నమస్కరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ గా మారింది.