Agnipath Protests: అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లో పలు రైళ్లకు నిప్పంటించారు.

Agnipath

 

 

Agnipath Protests: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లో పలు రైళ్లకు నిప్పంటించారు. ఇదిలా ఉంటే, బీహార్ డిప్యూటీ సీఎం ఇంటి బయట ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఉపముఖ్యమంత్రి రేణుదేవి ఇంటిపై దాడికి దిగారు.

అంతేకాకుండా పంజాబ్, హర్యానాల్లోనూ నిరసన సెగలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లర్లు సద్దుమణిగే ప్రయత్నం చేయాలని భావించిన కేంద్రం.. వయోపరిమితిని 2022 నాటికి 21ఏళ్ల నుంచి 23ఏళ్లు ఉన్నా ఇబ్బందిలేదని చెప్పింది.

గురువారం బీహార్, యూపీలో వివిధ ప్రాంతాల్లో చెలరేగిన నిరసనలు ఢిల్లీలో నాంగ్లోయ్, హర్యానా, మధ్యప్రదేశ్ లోని సమావేశాలతో ఊపందుకున్నాయి. కాంగ్రెస్ తో సహా పలు విపక్షాలు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం వల్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని మండిపడ్డాయి. అగ్నిపథ్ వల్ల యువతకు స్వల్ప కాలిక ఉపాధి మాత్రమే దక్కుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

Read Also: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి: రాహుల్‌, ప్రియాంకా గాంధీ