Restaurant Food Rates: హోటల్స్‌లో ఫుడ్ రేట్ ఇక నుంచి 30శాతం పెరగనుంది – ఇండియన్ అసోసియేషన్

హోటల్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఆ నష్టాలను అధిగమించే దిశగానే తాము అడుగులేస్తున్నామని రెస్టారెంట్ లో ఫుడ్ రేట్స్ పెంచే పనిలో పడ్డారు అధికారులు.

Restaurant Food Rates: కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది నష్టపోయారు. పలు రంగాల వారీగా వందల పరిశ్రమలు ఘోర నష్టాలను చవిచూశాయి. అందులో హోటల్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఆ నష్టాలను అధిగమించే దిశగానే తాము అడుగులేస్తున్నామని రెస్టారెంట్ లో ఫుడ్ రేట్స్ పెంచే పనిలో పడ్డారు అధికారులు.

ఈ మేరకు (AHAR) ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రెస్టారెంట్లలో ఫుడ్ రేట్ ను 30శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఎంజాయ్ చేద్దామనుకునేవారు పెరగనున్న ధరలకు తగ్గట్లుగా ప్రిపేర్ అవడం మంచిది. ఒక్క ఐటెం అని కాకుండా ఫుడ్ ఐటెంలు అన్నింటిపైనా ఈ ధరల పెంపు కనిపిస్తుంది.

కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్, వంటనూనె ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లిపాయల ధరలు మరోవైపు మండిపోతున్నాయి. వీటన్నిటి ప్రభావం రెస్టారెంట్లోని ఫుడ్ ఐటెంస్ పై ప్రభావం చూపిస్తున్నాయి. లాక్ డౌన్ లు, రెస్టారెంట్ నష్టాలు అన్నింటినీ తట్టుకుని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతున్నారు.

 

……………………………………….. : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడికి 14 రోజుల రిమాండ్

ట్రెండింగ్ వార్తలు