నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన ఫ్రెష్ పిటిషన్ ఉరి శిక్ష వాయిదాపడేలా చేస్తుందా.. అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ముఖేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్‌లతో పాటు ఉరి శిక్ష అనుభవించాల్సి ఉన్న వినయ్ పలు మార్లు పిటిషన్ వేస్తుండటంతో శిక్ష వాయిదాపడుతూనే ఉంది.
2012 డిసెంబరు 16న ఓ మెడికల్ స్టూడెంట్‌ను రేప్ చేసి చనిపోవడానికి కారణమైన కేసులో.. వీరిని శిక్షించింది సుప్రీం కోర్టు. మూడు సార్లు వేసిన పిటిషన్ల కారణంగా కొద్ది నెలల క్రితమే అమలు కావలసి ఉన్న శిక్ష మార్చి 20 నాటికి వాయిదా పడింది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని పలు మార్లు తప్పించుకుంటున్న నేరస్థుల శిక్ష సంగతేంటో.. మార్చి 20న చూడాలి.
ఫ్రెష్ పిటిషన్లో ఇలా పేర్కొన్నాడు. తనను ఉరిశిక్ష నుంచి కాపాడాలని.. జీవిత ఖైదు విధించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. జనవరి 22న ఉదయం 6 గంటలకు మొదటి వీరికి ఉరిశిక్ష అమలు కావాల్సివుంది. కానీ అప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరు మెర్సీ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తూ రావడంతో ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది.
జనవరి 22న, ఫిబ్రవరి 1న, మార్చి 3న డెత్ వారెంట్ వాయిదా పడుతూ వచ్చాయి. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు దోషులను ఉరి తీయాలని పటియాల కోర్టు ఆదేశించింది. దోషులకు ఇది నాలుగో సారి డెత్ వారెంట్. ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని పవన్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెబుతున్నారు.
See Also | YSRCP నిర్లక్ష్యమే TDPకి బలంగా మారుతుందా!?