Ahmedabad : 7వ అంతస్థు నుంచి కుప్పకూలిన లిఫ్ట్ .. ఎనిమిదిమంది దుర్మరణం

7వ అంతస్థు నుంచి లిఫ్ట్ కుప్పకూలటంతో ఎనిమిదిమంది మృతి చెందారు.

  • Published on- September 14, 2022 / 03:17 PM IST

Eight Labourers Killed In Elevator Crash In Ahmedabad

Ahmedabad : పొట్టకూటి కోసం వెళ్లిన శ్రమజీవులు విగతజీవులయ్యారు. ఏడవ అంతస్థు నుంచి లిఫ్ట్ కుప్పకూలిపోవటంతో ఎనిమిదిమంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ అహ్మదాబాద్​లో నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. బుధవారం (సెప్టెంబర్ 14,2022)ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గుజరాత్​ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2​ భవనంలో లిఫ్ట్ కూలింది. లిఫ్ట్ లో వెళుతున్న కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా లిఫ్ట్ కూలిపోవటం వల్లే కూలీలు చనిపోయనట్లుగా నిర్ధారణ అయ్యింది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్​ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు.

ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్​ఛార్జి జయేశ్​ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్​ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై మేయర్ KJ పర్మార్ మాట్లాడుతూ..మున్సిపల్ కార్పొరేషన్ నియమ నిబంధనలు ఉల్లంఘారని నిర్దారణ అయితే భవన యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.