Monsoon Alert: దేశంలో జోరందుకున్న రుతుపవనాలు.. ఎల్ని నో ప్రభావానికి చెక్.. 15 రోజులు భారీ వర్షాలు
రానున్న 15 రోజుల్లో దేశంలోని మధ్య, తూర్పు, ఉత్తర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు (Monsoon Alert)కురిసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Heavy rain is forecast across India as the monsoon strengthens.
- దేశంలో బలంగా నైరుతి రుతుపవనాలు
- వరుసగా అల్పపీడనాల విస్ఫోటనం
- రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు
Monsoon Alert: ప్రస్తుత వర్షాకాలంలో ఆగస్టు మాసంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా మారడంతో దేశ వ్యాప్తంగా వర్షాల జోరు పెరిగింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫోర్కాస్ట్స్ (ECMWF) నివేదిక ప్రకారం, రానున్న 15 రోజుల్లో దేశంలోని మధ్య, తూర్పు, ఉత్తర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు:
వర్షాల ఫ్యాక్టరీగా పిలిచే బంగాళాఖాతం ఈసారి సాధారణం కంటే ఎంతో చురుగ్గా మారి ఒకదాని వెనుక ఒకటి అల్పపీడనాలను సృష్టిస్తోంది. ఇవి భూభాగం వైపు కదులుతుండటం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు(Monsoon Alert) కురిసే అవకాశం ఉంది. సుదీర్ఘమైన వర్షపాత విరామం లేకపోవడం వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావానికి అడ్డుకట్ట:
ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న ఆందోళన తీవ్రంగా ఉండేది. అయితే బంగాళాఖాతంలో నిరంతరం ఏర్పడుతున్న బలమైన అల్పపీడనాలు మాన్సూన్ సర్క్యులేషన్‌ను నిలకడగా ఉంచుతూ ఎల్‌నినో ప్రతికూల ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. దీనివల్ల సీజన్లో వర్షపాత లోటు పెరగకుండా సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యేందుకు మార్గం సుగమమైంది.
