Royal Enfield Himalayan 440 : రూ. 2.29 లక్షలకే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440.. ఇంజన్, ఫీచర్లు అదుర్స్..!
Royal Enfield Himalayan 440 : భారత మార్కెట్లో రూ. 2.29 లక్షల ప్రారంభ ధరతో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440 లాంచ్ అయింది. 443cc ఇంజన్, 21-అంగుళాల వీల్, 220mm గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్-ఛానల్ ABS వంటి పూర్తి వివరాలివే..
Royal Enfield Himalayan 440
- అడ్వెంచర్ హిమాలయన్ 440 బుల్లెట్ బైక్ వచ్చేసింది
- 443cc ఇంజన్‌తో అదిరిపోయే స్పెసిఫికేషన్లు
- హిమాలయన్ 411కి కొత్త అవతారం..
- 21-అంగుళాల వీల్, 220mm క్లియరెన్స్
Royal Enfield Himalayan 440 : కొత్త బుల్లెట్ బైక్ కొంటున్నారా? అడ్వెంచర్ బైక్ కోరుకునే వారికోసం భారత మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. కంపెనీ కొత్త హిమాలయన్ 440 మోటార్‌సైకిల్‌ను రూ. 2.29 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
స్క్రామ్ 440 తర్వాత 440 ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన సెకండ్ మోడల్ ఇదే. ఇప్పటికే మార్కెట్లో నిలిపివేసిన హిమాలయన్ 411 రఫ్ అండ్ టఫ్ ఇమేజ్, కొత్త ప్లాట్‌ఫామ్‌తో ఈ బైక్‌ను రూపొందించారు.
హిమాలయన్ 440 బైకు మొత్తం 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రోజువారీ ప్రయాణాలే కాదు.. లాంగ్ రైడ్స్, ఆఫ్‌రోడింగ్‌కు సరిపోయేలా అద్భుతంగా ఉందది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. కొనుగోలుదారులు తమ ఇష్టాలకు తగినట్లుగా ఏదైనా ఎంచుకోవచ్చు.
Read Also : EPFO Members Alert : UAN యాక్టివేషన్ మాత్రమే కాదు.. UMANGలో ఈ 4 పనులు కూడా చేయొచ్చు!
ఇంజన్ విషయానికి వస్తే..
443cc ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. 6,250rpm వద్ద 25.4bhp పవర్, 4,000rpm వద్ద 34Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు.
ఆఫ్‌రోడ్ సామర్థ్యం కోసం ఫ్రంట్ 200mm, బ్యాక్ 180mm సస్పెన్షన్ ట్రావెల్‌ను అందించారు. అలాగే, 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫ్రంట్ 21-అంగుళాల, బ్యాక్ 17-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌ను అమర్చారు. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ 300mm, బ్యాక్ 240mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ లభిస్తుంది. అవసరమైతే బ్యాక్ ఏబీఎస్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక ఫీచర్లలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ డిస్ప్లే, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఇంధన స్థాయి, టైమ్ వివరాలు ఉన్నాయి. అదనంగా రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ మాడ్యూల్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా అందించారు.
