రెండు రోజులు మెట్రో రైళ్లు బంద్

  • Publish Date - November 21, 2020 / 01:15 AM IST

Ahmedabad Metro services : కరోనా వైరస్ విస్తరిస్తుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో నవంబర్ 20వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు కంప్లీట్ కర్ఫ్యూ అమలు కానుంది.



దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం…శనివారం, ఆదివారం మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు అహ్మదాబాద్ మెట్రో రైల్వే కార్పొరేషన్ వెల్లడించింది. నవంబర్ 23వ తేదీ సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.



కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రతి రోజు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ ఉంటుందని ఓ ఉత్తర్వులో వెల్లడించింది. కర్ఫ్యూ సమయంలో పాలు, మందులు విక్రయించే దుకాణాలు మాత్రమే తెరించి ఉంచడానికి అనుమతినిస్తామని Additional Chief Secretary Dr Rajiv Kumar Gupta వెల్లడించారు.



కర్ఫ్యూ ముగిసిన తర్వాత.. కోవిడ్ ను అదుపులోకి తెచ్చే క్రమంలో..రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తామన్నారు. కొవిడ్ – 19 రోగులకు అహ్మదాబాద్ లో బెడ్స్ కొరత లేదని, వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పని చేస్తున్నాయన్నారు. నగరంలో అంబులెన్స్ సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు