విమానంలో జైహింద్ అనాల్సిందే

  • Publish Date - March 5, 2019 / 01:23 PM IST

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశభక్తిని పెంపొందించేలా ఆదేశాలు జారీ చేసింది. విమాన సిబ్బంది చేసే ప్రతి ప్రకటన తర్వాత ‘జై హింద్’ అనే నినాదం వాడి ప్రకటనను ముగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎయిర్ ఇండియా అడ్వైజరీ డైరెక్టర్ అమితాబ్ సింగ్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తూ ఉంటారు సిబ్బంది.
Also Read : టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకండి అంటూ ప్రకటనలు చేస్తుంటారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కూడా ఈ రకమైన ప్రకటనలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సమయాల్లో ‘జైహింద్’ అనే నినాదం వాడాలంటూ ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి నిబంధన విధించింది.ఇది దేశభక్తిని పెంపొందించడం కోసమే అంటూ అమితాబ్ సింగ్ వివరించారు.

ఎయిరిండియా విమానాయాన సంస్థకు ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించాక అశ్వని లోహానీ 2016లో ఇదే తరహా ఆదేశాలను జారీ చేశారు. పైలట్లు తరుచూ ప్రయాణికులతో మైక్రోఫోన్‌లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలని ప్రయాణం మొత్తంలో కనెక్ట్ అయి ఉండాలని ప్రకటన తర్వాత జైహింద్ నినాదం చేయాలని లోహానీ ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం వల్ల దేశభక్తి పెరుగుతుందని అశ్వనీ లోహానీ చెప్పారు. సంప్రదాయం ప్రకారం విమానంలోకి ప్రయాణికులు ఎక్కేసమయంలో దిగే సమయంలో నమస్కారం చేసేవారు. ఇప్పుడు కూడా అదేలా నమస్కారం చేసి చిరునవ్వుతో ప్రయాణికులను పలకరించాలని లోహానీ సిబ్బందికి సూచించారు.
Also Read : మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స

ట్రెండింగ్ వార్తలు