కలకలం : ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు

  • Publish Date - April 25, 2019 / 05:10 AM IST

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న లోపాలను సరి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.  ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు ఏప్రిల్ 24వ తేదీ బుధవారం రాత్రి విమానం వెళ్లాల్సి ఉంది.

రన్ వే మీదకు వెళ్లే ముందు..టేకాఫ్ తీసుకొనే సమయంలో సిబ్బంది చెకింగ్ చేస్తుంటారు. దీనిని కూడా అలాగే చెక్ చేశారు. ఏసీలో టెక్నికల్ సమస్యలున్నట్లు గుర్తించారు. సిబ్బంది రిపేర్ చేస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఫైర్ శాఖకు విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఫ్లైట్‌ను అధికారులు రద్దు చేశారు. ప్రయాణీకులకు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తున్నారు.